NBK 108: అదిరిందయ్యా అనిల్!

సాధారంగా దర్శకుడు అంటే పరిమితంగా మాట్లాడాలి. సీరియస్ గా కనిపిస్తూనే.. సింపుల్ గా కూడా ఉండాలి. ఇలా డైరెక్టర్ల పట్ల అనేక రూల్స్ ఉంటాయి. ఉత్సాహం ఎక్కువైనా వేరే కళలు ఏమైనా ఉన్నా వాటిని దాచుకుంటూ హుందాగా ప్రవర్తించేందుకు ట్రై చేస్తుంటారు చాలా మంది డైరెక్టర్లు. కానీ కొంత మంది మాత్రం వీటన్నిటికి చెక్ పెడుతూ.. తమకు నచ్చినట్లుగా వ్యవహరిస్తుంటారు. వారిలో ఉన్న ఉత్సాహాన్ని ఆనందాన్ని తమలోని టాలెంట్లను బయటకు తీసేందుకు ఏమాత్రం వెనుకాడరు.

టాలీవుడ్ యంగ్ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఈ కోవలోకి చెందిన వాడే. కేవలం దర్శకత్వమే కాకుండా తనలో మరెన్నో టాలెంట్లను దాచుకున్నాడు. అతను ఎక్కడ ఉన్నా కామెడీ చేస్తూ అందరినీ నవ్విస్తుంటారు. చాలా సందడి సందడిగా గడుపుతుంటారు. ముఖ్యంగా తన సినిమాలు లేదా వేరే సినిమాల ప్రమోషన్ల కోసం అయన చేసే ప్రమోషన్ల వీడియోలు చాలా కామెడీగా ఉంటాయి. కేవలం కామెడీ మాత్రమే కాదండోయ్.. మరెవరూ ఊహించని హిడెన్ టాలెంట్ కూడా ఈయనలో ఉంది.

అదేంటంటే… అనిల్ రావుపూడి ఓ మంచి డ్యాన్సర్ కూడా. గతంలోనే కొన్ని సార్లు ఈ విషయం రుజువు అయింది. తాజాగా మరోసారి బయటకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి హాజరైన ఓ వేడుకలో ఆయన స్టెప్ ను అనుకరించి చూపించిన తీరుకు అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మరోసారి తన డ్యాన్సింగ్ టాలెంట్ చూపించాడు అనిల్. ప్రస్తుతం ఈయన నటసింహం నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఈ సినిమా షూటింగ్ సెట్స్ లోనే అతను ఫైట్ డ్యాన్స్ మాస్టర్లతో కలిసి బాలయ్య బాబు పాటకు స్టెప్పులేశారు. బాలయ్యా బాలయ్యా అంటూ సాగే ఈ పాటకు ఫైర్ మాస్టర్ ఓవర్ కాన్ఫిడెంట్ గా కనిపించారు. మధ్యలో డ్యాన్స్ మాస్టర్ కూడా జాయినయ్యాడు అని చెబుతూ అనిల్ వాళ్లతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. డ్యాన్సర్ గా మారిన డైరెక్టర్ అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

కుర్ర హీరోలా కనిపిస్తున్నారంటూ కొంత మంది చెబుతుండగా.. చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారంటూ మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడున్న స్టార్ దర్శకుల్లో ఇంత డ్యాన్సింగ్ టాలెంట్ ఉండి.. దాన్ని దాచుకోకుండా ఇలా ప్రదర్శించే వాళ్లెవరూ ఉండరు అంటు నెటిజెన్లు చెబుతున్నారు. అనిల్ రావుపూడిని యూత్ కు దగ్గర చేసింది కూడా ఈ హుషారే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అనిల్ డైరెక్టర్ గానే కాకుండా హీరోగా కనిపించినా చూస్తారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.