మెగా డాటర్ నిహారిక కొనిదెల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. నాగబాబు అత్యంత వైభవంగా నిహారిక పెళ్లి తంతును నిర్వహించారు. పెళ్లి ఫొటోలు వీడియోలు అన్ని కూడా కన్నుల వింధుగా ఉన్నాయి అనడంలో సందేహం లేదు. నిహారిక మరో వీడియోను షేర్ చేసింది. పెళ్లి తంతు మొదలు పెట్టడం మొదలు పూర్తి అయ్యే వరకు మొత్తం మూమెంట్స్ ను అందులో చూపించారు. అత్యంత ఆకర్షనీయంగా ఉన్న ఆ వీడియో లో నిహారిక కన్నీరు పెట్టుకున్నది కూడా చూపించారు.
వీడియో ఆరంభంలో నిహారిక ల్యాప్ టాప్ లో తన పెళ్లికి సంబంధించిన వీడియోలు మరియు ఫొటోలు చూస్తూ కంటి వెళ్ల నవ్వుతూ ఆనంద భాష్పలు రాల్సింది. ఆ తర్వాత చైతన్య తాళి కట్టే సమయంలో కూడా నిహారిక కన్నీరు పెట్టుకుంది. నిహారిక కన్నీరు పెట్టుకుంటూ ఉండగా చిరంజీవి నవ్వు అంటూ స్మైల్ సింబల్ పెట్టడం కూడా వీడియోలో చూడవచ్చు. మొత్తానికి పెళ్లి సందడి అంతా కూడా సింపుల్ గా స్వీట్ గా వీడియోలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.