మెగా డాటర్ ట్రావెల్ షో నిజమేనా?

మెగా డాటర్ నిహారిక ఇటీవల చోటు చేసుకున్న పబ్ ఘటన తర్వాత సోషల్ మీడియాకి దూరమైన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఇన్ స్టా ఖాతా నుంచి వైదొలిగింది. ఇలా వరుస ఘటనలతో నిహారిక పేరు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. నిహారిక జీవితంలో ఏం జరగుతుంది? అంటూ ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.

తాజా పిక్ తో వాటన్నింటికి సమాధానం దొరికేసింది. నిహారిక ..ఆమె భర్త చైతన్య జోర్డాన్ వెకేషన్ ఆస్వాదిస్తోన్న ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ గా మారాయి. క్యూట్ కపుల్స్ చాపర్ లో ఇలా ప్రయాణం చేస్తూ కనిపిస్తున్నారు. మరి ఈ జంట అలా కొద్ది రోజుల పాటు వెకేషన్ కి వెళ్లారా? అంటే పొరబడినట్లే. ఇద్దరు సీక్రెట్ గా పెద్ద మిషన్ నే ప్లాన్ చేసారు.

ఓ ట్రావెల్ షో నిర్వహించడానికి జోడీ ఇలా ప్రయాణం సాగిస్తున్నట్లు వెలుగులోకి వస్తుంది. నిహారిక-చైతన్య జోర్డాన్ టూర్ మొత్తాన్ని షూట్ చేసి ట్రావెల్ షోగా డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని ప్రచారం సాగుతోంది. ఈ జంట వారితో పాటు కెమెరా మ్యాన్లు..ఇతర సిబ్బందిని సైతం వెంట తీసుకుని వెళ్ఆరని భొగట్టా.

ఈ ట్రావెల్ షో ప్రసారం ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చినట్లు తెలుస్తుంది. తెలుగు వెర్షన్ ఓటీటీ రూపంలో రిలీజ్ కానుంది. బహుశా ఆహాలో దాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక ఇంగ్లీష్ వెర్షన్ మాత్రం ఓ జాతీయ టీవీలో ప్రసారం చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. ఇలాంటి షో నిర్వహించాలని నిహారిక చాలా కాలంగా అనుకుంటోంది.

కానీ ఖర్చు..శ్రమ వ్యవ ప్రయాసలతో కూడున్నది కావడంతో ఇంత కాలం దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు భర్త సహకారం కూడా తోడైంది కాబట్టి ముందడుగు పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాలు ఇంకా ధృవీకరించబడలేదు.

నిహారిక గానీ..నాగబాబు గానీ దీనిపై వివరణ ఇస్తే తప్ప క్లారిటీ రాదు. నిహారిక వివాహం చేసుకున్నా సినిమాలపై ఆసక్తి కొనసాగిస్తూనే ఉన్నారు. నటిగా కొనసాగకపోయినా వెబ్ సిరీస్ ల నిర్మాతగా కంటున్యూ అవుతున్నారు.