హీరో నిఖిల్ ను అడ్డుకున్న పోలీసులు..! ఆపై ఏం చేశారంటే..

కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నారు పోలీసులు. ఈక్రమంలో ఓ మెడికల్ ఎమర్జెన్సీపై ఆసుపత్రిలో మెడిసిన్ ఇచ్చేందుకు వెళ్తున్న సినీ హీరో నిఖిల్ ను అడ్డుకున్నారు. అనుమతి లేదని ఈ-పాస్ తప్పనిసరని చెప్పారు. దీంతో ఆయన వెనుదిరిగి విషయాన్ని ట్విట్టర్లో తెలిపారు.

‘కొవిడ్‌ తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తికి మందులు ఇచ్చేందుకు ఉప్పల్‌ నుంచి మినిస్టర్స్‌ రోడ్డులో కిమ్స్‌కి వెళ్తుంటే పోలీసులు నా కారుని అడ్డుకున్నారు. వారికి బాధితుడు వివరాలు.. వైద్యులు రాసిచ్చిన ప్రిస్ర్కిప్షన్‌ చూపించినా అనుమతివ్వలేదు. ఈ–పాస్‌ తప్పనిసరి చెప్పారు. అప్పటికీ తొమ్మిది సార్లు ప్రయత్నించినా సర్వర్ల సమస్యతో పాస్‌ దొరకలేదు. మెడికల్‌ ఎమర్జెన్సీ అని చెబితే అనుమతిస్తారని భావించాను’ అని ట్వీట్‌ చేశారు.

నిఖిల్‌ ట్వీట్‌కు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ విభాగం స్పందించింది. ‘డియర్‌ సర్‌, మీ లొకేషన్‌ పంపించండి. స్థానిక అధికారులతో మాట్లాడి మీకు అనుమతి వచ్చేలా చేస్తాం’ అని రిప్లై ఇచ్చింది.

.