కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ ఏడాది బడ్జెట్ విప్లవాత్మక మార్పులను తీసుకు వచ్చింది. బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్బంగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ పర్యావరణంను పరిరక్షించేందుకు గాను కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని దానికి కట్టుబడి ఉంటుందని పేర్కొంది. ముఖ్యంగా కాలుష్యంకు కారణం అవుతున్న ఔట్ డేటెడ్ వాహనాలను తుక్కుగా మార్చేందుకు కేంద్రం సిద్దంగా ఉందని ఈ సందర్బంగా ఆమె పేర్కొన్నారు.
కమర్షియల్ వాహనాలను 15 ఏళ్లకు మరియు వ్యక్తిగత వాహనాలను 20 ఏళ్లకు తుక్కుగా మార్చే విషయాన్ని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. వాయు కాలుష్యం ను నివారించేందుకు బడ్జెట్ లో రూ.2217 కోట్లను కేటాయించడం జరిగింది. పాత వాహనాలను తుక్కుగా మార్చడం వల్ల కొత్త వాహనాల కొనుగోలు పెరిగి ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంది. కనుక అన్ని విధాలుగా ఆ వాహనాలను తుక్కుగా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా బడ్జెట్ లో ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.