స్టార్‌ హీరోయిన్ చెల్లి రీ ఎంట్రీ

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ చెల్లి నిషా అగర్వాల్ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. ఆ సినిమాల్లో ఎక్కువ శాతం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో సినిమాలకు గుడ్‌ బై చెప్పి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత బాబుకు కూడా జన్మనిచ్చింది. మళ్లీ నిషా అగర్వాల్ ను స్క్రీన్ పై చూస్తామని ప్రేక్షకులు అనుకోలేదు. కాని తాజాగా నిషా అగర్వాల్‌ ను మళ్లీ తీసుకు రాబోతున్నారు. అయితే సినిమా ద్వారా కాకుండా ఒక వెబ్‌ సిరీస్ ద్వారా ఈమె రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

చిన్నా చితకా వెబ్‌ సిరీస్ లో అయితే ఈ విషయాన్ని పెద్దగా చర్చించేవాళ్లం కాదు. కాని ఈమె రీ ఎంట్రీ ఇవ్వబోతున్నది టాలీవుడ్ స్టార్‌ హీరోలు బాబాయి అబ్బాయి అయిన వెంకటేష్ మరియు రానాల కాంబోలో రూపొందబోతున్న వెబ్‌ సిరీస్ ద్వారా. తెలుగు తో పాటు పలు భాషల్లో ఈ వెబ్‌ సిరీస్‌ ను స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ప్రముఖ ఓటీటీ ఈ వెబ్‌ సిరీస్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చేస్తుంది. నిషా అగర్వాల్‌ రీ ఎంట్రీ తర్వాత వెండి తెరపై కూడా సందడి చేస్తుందేమో చూడాలి.