ఈ సమయంలో ‘రంగ్‌ దే’కు భలే రేటు వచ్చింద


కరోనా లాక్ డౌన్ కారణంగా తెలుగు సినిమాల ఓవర్సీస్ మార్కెట్‌ తీవ్రంగా ప్రభావితం అయ్యింది. గతంలో ఓవర్సీస్లో కోట్లు కురిపించిన తెలుగు సినిమాలు ఉన్నాయి. అలాంటిది తెలుగులో వంద కోట్లు రాబట్టిన ఉప్పెన సినిమా ఓవర్సీస్ లో పెద్దగా ప్రభావం చూపించలేక పోయింది. అంటే కరోనా ప్రభావం ఇంకా అక్కడ ఉందని అర్థం అవుతుంది. ఇలాంటి సమయంలో రంగ్ దే సినిమా ఓవర్సీస్ లో భారీ బిజినెస్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉంది.

నితిన్ గతంలో ఓవర్సీస్ లో గొప్ప వసూళ్లు సాధించింది కొన్ని సార్లే. అయినా కూడా రంగ్ దే సినిమా ను ఓవర్సీస్‌ కోసం ఏకంగా రూ.1.55 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో ఇంత భారీ రేటు పలకడం అంటే చాలా గొప్ప విషయంగా చెబుతున్నారు. ఈ మొత్తంను అక్కడ నితిన్ రాబట్టగలిగితే సినిమా సూపర్‌ హిట్‌ అయినట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. కీర్తి సురేష్‌ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే.