ఎన్టీఆర్ క్రేజ్ అక్కడ మామూలుగా లేదుగా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తరువాత తారక్ తన నెక్ట్స్ మూవీని తెలుగు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేయబోతున్నట్లు గతంలోనే అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమా షూటింగ్‌ను మాత్రం ఆర్ఆర్ఆర్ చిత్రం పూర్తయ్యాకే ప్రారంభించాలని తారక్ భావిస్తున్నాడట. దీంతో ఈ సినిమా అనుకున్నదానికంటే మరింత ఆలస్యంగా రానున్నట్లు చిత్ర వర్గాల్లో చర్చ నడుస్తోంది.

కాగా ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే అదిరిపోయే క్రేజ్‌ను క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా త్రివిక్రమ్-తారక్ కాంబో అనగానే ఓవర్సీస్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. గతంలో వచ్చిన అరవింద సమేత చిత్రం అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకోవడమే దీనికి ముఖ్య కారణం. దీంతో ఇప్పుడు మరోసారి ఈ కాంబో రానుండటంతో ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం అక్కడి డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ కోసం పేరుమోసి ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లు ఒక్కటవుతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాను అక్కడ వారిద్దరు కలిసి రిలీజ్ చేసేందుకు అత్యంత భారీ రేటును ఆఫర్ చేశారట. దీంతో ఈ సినిమాను అక్కడ వారే రిలీజ్ చేయడం దాదాపు ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇంకా షూటింగ్ కూడా మొదలుకాని సినిమా కోసం ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లు ఒక్కటి కావడం, భారీ రేటును ఆఫర్ చేయడమంటే తారక్ క్రేజ్ ఏ లెవెల్‌లో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ పెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు చిత్ర వర్గాల టాక్.