తెలుగులో రియాలటీ, ఎంటర్ టైన్మెంట్ షోస్ కి ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా వీటిలో సినీ సెలబ్రిటీలు హోస్ట్ చేయడం మరింత ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ 4 సీజన్ కు నాగార్జున కిక్కు తెప్పిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ త్వరలో జెమినీ టీవీలో ఓ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నాడనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎంత అనే టాపిక్ కూడా వైరల్ అయింది. అయితే..
ఈ షోకు ఎన్టీఆర్ రెమ్యునరేషన్ తీసుకోవట్లేదని టీ టౌన్ వార్త. ఇందుకు కారణం.. ఈ షో కంటెంట్ ఎన్టీఆర్ కు విపరీతంగా నచ్చడమేనట. అందుకే.. రెమ్యునరేషన్ కాకుండా ఈ షోలో పెట్టుబడి పెడుతున్నాడనే వార్త షికారు చేస్తోంది. దీంతో షో నిర్వాహకులతో పాటు లాభాల్లో వాటా తీసుకునే విధంగా ప్లాన్ చేసాడని అంటున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వార్తపై నిజమెంతో తెలియాల్సి ఉంది.