ఎన్టీఆర్ ను కలిసిన త్రివిక్రమ్… త్వరలోనే #ఎన్టీఆర్30

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సూపర్బ్ ఫామ్ లో ఉన్నాడు. టెంపర్ నుండి మొదలుపెట్టి వరసగా విజయవంతమైన చిత్రాలనే చేస్తూ వస్తున్నాడు ఎన్టీఆర్. అరవింద సమేత వంటి విజయం తర్వాత రాజమౌళి సినిమాకే అంకితమైపోయాడు. ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీమ్ గా కనిపించనున్నాడు ఎన్టీఆర్.

ఆర్ ఆర్ ఆర్ పూర్తైన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఎన్టీఆర్ మరోసారి పనిచేయనున్నాడు. ఈమేరకు అధికారిక ప్రకటన ఎప్పుడో వచ్చిన విషయం తెల్సిందే. అయితే కోవిద్ కారణంగా ఈ సినిమా పట్టాలెక్కడానికి చాలా ఆలస్యమైంది.

ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ పై బోలెడన్ని రూమర్స్ షికార్లు చేయడం మొదలైంది. అయితే వాటిని పటాపంచలు చేస్తూ ఈరోజు అధికారిక ప్రకటన వచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా ఈరోజు ఉదయం త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత నాగవంశీతో పాటు ఎన్టీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా వీరి కాంబినేషన్ లో చిత్రం అతి త్వరలోనే పట్టాలెక్కబోతోంది అని అధికారికంగా తెలియజేసారు. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రానికి మరో నిర్మాత.