‘అఖండ’ మెయిన్ విలన్ మరో ఫ్యామిలీ హీరో


నందమూరి బాలకృష్ణ, బోయపాటిల కాంబోలో వచ్చిన గత చిత్రం లెజెండ్‌ లో జగపతిబాబు విలన్ గా నటించాడు. ఫ్యామిలీ హీరోగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన జగపతిబాబు లెజెండ్‌ తో సెకండ్‌ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టాడు. లెజెండ్‌ సినిమా హిట్ అయిన నేపథ్యంలో జగ్గూ భాయ్ బిజీ విలన్ గా మారిపోయాడు. ఇక బాలయ్య బోయపాటిల కాంబోలో రూపొందుతున్న అఖండ సినిమా లో శ్రీకాంత్‌ ను విలన్ గా తీసుకు వస్తున్నాడు. శ్రీకాంత్‌ గతంలోనే విలన్ గా చేసినా కూడా పూర్తి స్థాయిలో మెప్పించలేక పోయాడు.

ఫ్యామిలీ హీరోగా శ్రీకాంత్‌ సుదీర్ఘ కాలంగా స్టార్‌ గా కొనసాగాడు. ప్రస్తుతం ఆయన విలన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. పూర్తి స్థాయి మెయిన్ విలన్‌ గా అఖండ ద్వారా శ్రీకాంత్‌ పరిచయం కాబోతున్నాడు. అందుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ పుకారు ఒకటి షికారు చేస్తోంది. బాలయ్య ను శ్రీకాంత్ ఢీ కొనే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయట. శ్రీకాంత్‌ లుక్ మరియు ఇతర విషయాల్లో కూడా బోయపాటి చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు.