‘హరి హర వీరమల్లు’ లో నిధి ట్విస్ట్‌ సూపర్‌!

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో తెల్సిందే. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ను పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి ప్రతి రోజు ఏదో ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఈ సినిమా లో హీరోయిన్‌ విషయమై ప్రస్తుతం నెట్టింట ఒక ఆసక్తికర వార్త ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్‌ నెగటివ్ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించబోతుందట. పవన్‌ కళ్యాణ్ ను ఆమె మోసం చేసే పాత్రలో కనిపిస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా తో నిధి అగర్వాల్‌ బిజీ అవుతుందని అంతా నమ్మకంగా ఉన్నారను. ఇదే సమయంలో ఆమె నెగటివ్‌ షేడ్స్‌ అనడంలో మరింతగా ఆమె పాత్రకు గుర్తింపు రావడం ఖాయమనే నమ్మకం ఏర్పడుతోంది. పవన్‌ ను నిధి మోసం చేసే కథ ట్విస్ట్‌ సినిమా కే ప్రధాన ఆకర్షణగా ఉంటుందని అంటున్నారు.