పవన్‌ రానాల మూవీకి త్రివిక్రమ్‌ కీలక సూచన

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌ సూచనలు ఇస్తూ సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా మలయాళం హిట్‌ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌. ఈ సినిమా రీమేక్ లో పవన్‌ కళ్యాణ్ మరియు రానా లు హీరోలుగా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సాగర్‌ చంద్ర తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టాల్సి ఉండగా కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల నిలిచి పోయింది. ఇక ఈ సినిమాలో కేవలం మూడు పాటలు మాత్రమే ఉండబోతున్నాయట.

ఒరిజినల్ వర్షన్‌ ను ఎక్కువగా కదిలించకుండా కాస్త కమర్షియల్‌ హంగులు అద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అయిదు ఆరు పాటలు పెట్టకుండా రెండు మూడు పాటలు చాలని ఎక్కువ అయినా కూడా కథ అర్థం మారిపోవడం లేదా మరేదైనా జరిగే అవకాశం ఉందని ఈ సందర్బంగా త్రివిక్రమ్‌ అన్నాడట. దాంతో దర్శకుడు అదే దిశగా ప్లాన్ చేస్తున్నాడు. పవన్‌ కూడా రెండు మూడు పాటలకు ఓకే అన్నాడని తెలుస్తోంది. మరి రెండు మూడు పాటల్లో ఏ హీరోకు ఎన్ని పాటలు ఉంటాయి అనేది చూడాలి.