ఏపీ ప్రభుత్వం తెలుగు అకాడమీ పేరును తెలుగు – సంస్కృత అకాడమిగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన జీవోను కూడా హడావుడిగా విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వ నిర్ణయంపై విపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు అకాడమీ అనేది సుదీర్ఘ కాలంగా తెలుగు వారితో అనుబంధంను కలిగి ఉంది. అలాంటి ఒక సంస్థ పేరు మార్చడం అనేది ప్రజల మనోభావాలన దెబ్బ తీయడం అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశాడు.
తెలుగు అకాడమీ పేరు మార్చి ఏం సాధిస్తారు అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు. తెలుగు భాష అభివృద్ది కోసం కృషి చేయాల్సిన ప్రభుత్వం ఇలాంటి పనులు చేయడం ఎంత వరకు కరెక్ట్. పేరును ఇంత హడావుడిగా మార్చాల్సిన అవసరం ఏం వచ్చింది. అంతగా సంస్కృత భాషను అభివద్ది చేయాలంటే ప్రత్యేకంగా సంస్కృత అకాడమీని ఏర్పాటు చేయవచ్చు కదా అంటూ పవన్ సూచించాడు. వెంటనే ప్రభుత్వం తెలుగు అకాడమీ పేరును తిరిగి పాత పద్దతిలో మార్చాలంటూ ఆయన డిమాండ్ చేశాడు. ఈ విషయం లో ఇతర పార్టీలతో కలిసి జనసేన ముందుకు సాగుతుందని.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తామని అన్నారు.