పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు విడుదల తేదీ ఖరారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం భీమ్లా నాయక్ తో పాటు హరిహర వీర మల్లు చిత్రం కూడా షూటింగ్ దశలో ఉంది. భీమ్లా నాయక్ పూర్తవ్వగానే హరిహర వీర మల్లు షూటింగ్ ను తిరిగి మొదలుపెడతారు.

ఇప్పటికే ఫస్ట్ హాఫ్ షూటింగ్ దాదాపుగా పూర్తైపోయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హరిహర వీర మల్లు విడుదల తేదీని ఖరారు చేసారు. ఏప్రిల్ 29, 2022న ఈ సినిమా విడుదలవుతోంది.

ఇప్పటికే భీమ్లా నాయక్ జనవరి 12కి కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో మూడు నెలల గ్యాప్ లో పవన్ సినిమాలు రెండు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను క్రిష్ డైరెక్ట్ చేస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.