నేడు మా ఎన్నికలు జరుగుతున్నాయి. మంచు విష్ణు మరియు ప్రకాష్ రాజ్ లు ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోటీ పడ్డారు. రాజకీయ ఎన్నికలు తలపిస్తున్న ఈ ఎన్నికల్లో ఎంత మంది పాల్గొంటున్నారు.. ఎంత మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొంటారు.. విజేత ఎవరు అనే విషయం రాత్రి వరకు తేలిపోయే అవకాశం ఉంది. తాజాగా మా ఎన్నికల రగడపై పవన్‌ కళ్యాణ్ స్పందించాడు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మీడియాతో ఇంటరాక్ట్‌ అయిన పవన్ మా ఎన్నికల్లో జరుగుతున్న విషయాలపై స్పందించాడు.

సినిమా ఇండస్ట్రీని చీల్చే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారు అంటూ కొందరు ఈమద్య వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాటికి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. సినిమాలు చేసేవాళ్లు ఆదర్శంగా ఉండాలి. సినిమా పరిశ్రమ చీలడం అనే ప్రశ్నే లేదు. తిప్పి కొడితే 900ల ఓట్లు ఉన్నాయి. ఇందులో వ్యక్తిగత దూషణలు అవసరమా ?మోహన్‌ బాబు, చిరంజీవి ఇద్దరూ మంచి స్నేహితులే. మా ఎన్నికలకు ఇంత హడావుడి అవసరమా అంటూ పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.