పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – సెన్సిబుల్ డైరక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా తెరకెక్కబోతోందా..? అంటే.. టీటౌన్ లో ప్రస్తుతం ఈ గాసిప్ బాగా వైరల్ అవుతోంది. రానాను హీరోగా తెరకెక్కించిన లీడర్ మంచి విజయంతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మంచి కాఫీలాంటి సినిమాలు తీసే కమ్ముల పొలిటికల్ జోనర్స్ తో కూడా అద్భుతాలు చేయగలనని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఈక్రమంలో పవన్ కోసం ఓ పవర్ ఫుల్ పొలిటికల్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో పవన్ కు ఉపయోగపడేలా.. తన పొలిటికల్ కెరీర్ కు ఉపయోగపడేలా శేఖర్ ఈ కథ సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పవన్ కు ఎంతటి మాస్ ఇమేజ్ ఉందో, ఫ్యాన్ బేస్ ఉందో తెలిసిన విషయమే. 2024 ఎన్నికల్లో పవన్ కు ఉపయోగపడేలా ఈ కథ ఉంటుందని అంటున్నారు. అయితే.. దీనిపై అఫీషియల్ న్యూస్ ఏమీ లేదు. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే శేఖర్ కమ్ముల మాత్రమే చెప్పాలి.