చిరు, పవన్‌ల మల్టీ స్టారర్ మూవీ వార్త మళ్లీ వచ్చింది

తెలుగు ప్రేక్షకులకు మల్టీస్టారర్ మూవీ అంటే పండుగే. ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కలిసి నటించినా కూడా ఫలితంతో సంబంధం లేకుండా కోట్లు కురిపించేందుకు ప్రేక్షకులు సిద్దంగా ఉంటారు అనడంలో సందేహం లేదు. చాలా కాలంగా చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ల మల్టీ స్టారర్‌ మూవీ గురించి వార్తలు వస్తున్నాయి. ఆమద్య మాజీ ఎంపీ టీ సుబ్బిరామిరెడ్డి తాను చిరంజీవి, పవన్‌ తో సినిమా చేస్తానంటూ ప్రకటించిన విషయం తెల్సిందే. దానికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తాడని కూడా చెప్పాడు.

మల్టీ స్టారర్ మూవీ గురించి సుబ్బిరామిరెడ్డి మళ్లీ మాట్లాడలేదు. చాలా కాలం తర్వాత చిరంజీవి మరియు పవన్‌ లు వరుసగా సినిమాలు చేస్తున్నారు. కనుక ఇప్పుడు వీరిద్దరి కాంబో మల్టీస్టారర్‌ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందని అటున్నారు. రికార్డు స్థాయి బడ్జెట్ తో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సుబ్బిరామిరెడ్డి సినిమాను నిర్మించబోతున్నాడట. వచ్చే దసరాకు ఈ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది. 2022 లేదా 2023లో ఈ క్రేజీ మల్టీస్టారర్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందట.