హరిహర వీరమల్లు కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు సినిమా విషయంలో ఫుల్ కమిటెడ్ గా ఉన్నాడు. అల్లాటప్పాగా ఈ చిత్రాన్ని చేయబోవట్లేదు. ఏప్రిల్ 8 నుండి ఈ చిత్ర తాజా షెడ్యూల్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం స్పెషల్ ట్రైనింగ్ ను తీసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ తోడొర్ లజారావ్ పర్యవేక్షణలో ఈ చిత్రంలో యాక్షన్ సీన్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.

ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రానికి చాలా ప్రత్యేకం అని తెలుస్తోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నిధి అగర్వాల్ కథానాయిక. క్రిష్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది.

ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడు. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. దీంతో పాటు హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ చిత్రాన్ని కూడా మొదలుపెట్టనున్నాడు.