పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ పై ఫైనల్ క్లారిటీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా అనౌన్స్ అయ్యి చాలా కాలమే దాటిపోయింది. అయినా పవన్ వేరే సినిమాలు కమిట్ అవుతున్నాడు కానీ హరీష్ శంకర్ చిత్రంపై ఎలాంటి అప్డేట్ రావడం లేదు. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా ఈ చిత్రం ఇక ఆగిపోయినట్లే అన్న వార్తలు వచ్చాయి.

కానీ ఈ రూమర్స్ మరింతగా ముదరక ముందే చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ కు వెళ్తుందని అప్డేట్ ఇచ్చింది. దర్శకుడు హరీష్ శంకర్, మైత్రి నిర్మాతలు ఇటీవలే పవన్ కళ్యాణ్ ను కలిసి షూటింగ్ షెడ్యూల్ గురించి డిస్కస్ చేసినట్లు సమాచారం.

ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీర మల్లు షూటింగ్ కోసం సమాయత్తమవుతున్నాడు.