పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా వకీల్ సాబ్ టీజర్ ను విడుదల చేసిన సంగతి తెల్సిందే. దానికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. లైక్స్ పరంగా, వ్యూస్ పరంగా ఈ టీజర్ సూపర్బ్ అనిపించుకుంది.
ఇక తాజా సమాచారం ప్రకారం వకీల్ సాబ్ కు అదిరిపోయే సాటిలైట్ డీల్ కుదిరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. జీ5 సంస్థ ఏకంగా 15 కోట్ల రూపాయల ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అటు స్ట్రీమింగ్, ఇటు సాటిలైట్ కు కలిపి ఈ అమౌంట్ ను ఫిక్స్ చేసారు.
అయితే నిర్మాతలు ఇంకా ఈ డీల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అంజలి, నివేత థామస్, అనన్యలు కీలక పాత్రల్లో నటించారు. సమ్మర్ లో వకీల్ సాబ్ ను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.