మళ్ళీ షూటింగ్స్ లో బిజీ అయిన పవన్ కళ్యాణ్

గత కొన్ని రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ మీటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. తన జనసేన లీడర్స్ తో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పొలిటికల్ టెన్షన్స్ పై చర్చించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టాడు.

ఈరోజు నుండి పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మలయాళ రీమేక్ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ లో పవన్ నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో రానా దగ్గుబాటి మరో హీరోగా కనిపించనున్నాడు.

అల్యూమినియం ఫ్యాక్టరీలో వీరిద్దరి కాంబినేషన్ లో సీన్స్ ను షూట్ చేస్తున్నారు. సాగర్ కె చంద్ర ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు రాసాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెల్సిందే. అలాగే మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కాబోతోంది. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ విడుదల ఉండగా, ఆ హంగామా అప్పుడే మొదలైంది.