వకీల్ సాబ్‌కు లేని క్రేజ్‌.. వీరమల్లుపైనే అందరి దృష్టి

పవన్‌ కళ్యాణ్‌ వచ్చే నెలలో వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ పింక్ మూవీకి వకీల్ సాబ్ రీమేక్ అనే విషయం తెల్సిందే. పింక్ మహిళల సమస్యలపై రూపొందిన సినిమా అని అందరికి తెలుసు. కనుక వకీల్ సాబ్ ను కమర్షియల్‌ యాంగిల్‌ లో చూడలేక పోతున్నారు. మేకర్స్ కాస్త కమర్షియల్ టచ్‌ ఇచ్చినా కూడా బయ్యర్లు మరియు ప్రేక్షకులు వకీల్ సాబ్ ను ఒక కమర్షియల్ సినిమా గా చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. త్వరలో విడుదలకు సిద్దంగా ఉన్నా కూడా పట్టించుకునే వారు కరువయ్యారు.

వకీల్ సాబ్ సినిమా కంటే కూడా ప్రేక్షకులు అంతా కూడా ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల విడుదలైన హరిహర వీరమల్లు సినిమా ఫస్ట్‌ లుక్‌ మరియు గ్లిమ్స్‌ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ను దర్శకుడు క్రిష్ దాదాపుగా 150 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిస్తున్నాడు. విజువల్‌ వండర్ గా ఈ సినిమా ను చూపించేందుకు భారీ ఎత్తున గ్రాఫిక్స్ ను వినియోగిస్తున్నట్లుగా చెబుతున్నారు. కనుక వకీల్‌ సాబ్ కంటే కూడా అధికంగా హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు పెంచుకుని పవన్ అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.