నాలుగు కీలకమైన ఫైట్లలో వకీల్ సాబ్ రచ్చ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ ఏప్రిల్ 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఈరోజే చిత్ర ట్రైలర్ ను విడుదల చేస్తారు. ఇదిలా ఉంటే వకీల్ సాబ్ లో నాలుగు కీలకమైన ఫైట్లు ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హిట్ సినిమా పింక్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోన్నా వకీల్ సాబ్ లో ఫైట్స్ ను పెట్టాడు దర్శకుడు వేణు శ్రీరామ్.

ఇంట్రడక్షన్ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్ తో పాటు మెట్రో స్టేషన్ ఫైట్, రెస్ట్ రూమ్ ఫైట్ ఉంటాయని తెలుస్తోంది. మరి పింక్ సినిమా సోల్ మిస్ అవ్వకుండా ఇలాంటి కమర్షియల్ హంగులను దర్శకుడు ఎలా జొప్పించాడు అన్నది ఆసక్తికరంగా మారింది. నాలుగేళ్ళ తర్వాత పవన్ నుండి వస్తోన్న సినిమా కావడంతో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఖుషీగా ఉన్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందించిన విషయం తెల్సిందే.