గత కొన్ని గంటలుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై కొంత గందరగోళం నెలకొనడంతో జనసేన పార్టీ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బంది కరోనా బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ కు దగ్గరగా పనిచేసే వారు కరోనా బారిన పడుతుండడంతో పవన్ కళ్యాణ్ హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు.
వైద్యుల సూచన మేరకే పవన్ కళ్యాణ్ హోమ్ క్వారంటైన్ కు వెళ్లినట్లు అధికారికంగా వెల్లడైంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో నివసిస్తున్నారు. అలాగే రోజూ వారి కార్యక్రమాలను, పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు.
పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సూపర్ టాక్ తో నడుస్తున్న విషయం తెల్సిందే.
క్వారంటైన్ లో శ్రీ @PawanKalyan గారు pic.twitter.com/9J2x8cG3jn
— JanaSena Party (@JanaSenaParty) April 11, 2021