హీరోలు కొన్ని సార్లు తమకు ఇష్టం లేకుండానే సినిమాలు చేయాల్సి ఉంటుంది. హీరోలు మొహమాటస్తులు అయితే చాలా చెత్త సినిమాలు ప్లాప్స్ సినిమాలు వస్తాయి. పవన్ కళ్యాణ్ మొహమాటం వల్ల కూడా కొన్ని సినిమాలు అలా వచ్చాయి. పవన్ కళ్యాన్ హీరోగా వచ్చిన బంగారం సినిమా ప్లాప్ అవుతుందని ముందే అనుకున్నారట. కథ చెప్పినప్పుడు ఇది వర్కౌట్ అవ్వదని పవన్ అన్నా కూడా దర్శకుడు బతిమిలాడాట.
దర్శకుడు ధరణి మాట్లాడుతూ నేను పవన్ ను కలిసి కథ చెప్పిన సమయంలోనే పవన్ కు నచ్చలేదు. అయినా కూడా నేను చేతులు పట్టుకుని బతిమిలాడాను. అందుకే నాకు అవకాశం ఇచ్చాడు. ఆయన అన్నట్లుగానే సినిమా నిరాశ పర్చింది అంటూ చెప్పుకొచ్చారు. పవన్ మొహమాటంతో ఈ సినిమాను చేసినట్లుగా వారు చెప్పుకొచ్చారు. బంగారం వంటి సినిమా ను పవన్ ఎలా చేశారు అంటూ అప్పట్లో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.