దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు నిర్మించిన పెళ్లి సందD సినిమా దసరా కానుకగా విడుదల అయ్యింది. సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీలీలకు మాత్రం మంచి పేరు వచ్చింది. ఈ అమ్మాయికి టాలీవుడ్ లో మంచి భవిష్యత్తు ఉంది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మొదటి సినిమా విడుదల కాకుండానే ఈమెకు ఇప్పటికే రెండు ఆఫర్లు వచ్చాయి అనేది అందరికి తెల్సిందే. ఈ అమ్మాయి తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి అనే విషయం ఇటీవల ప్రచారం జరుగుతోంది. కృష్ణా జిల్లా ఉంగుటూరుకు చెందిన సూరపనేని శుభాకరరావు కుమార్తెగా ప్రచారం జరగుతోంది. కృష్ణ జిల్లాకు చెందిన సూరపనేని వారి సంక్షేమ సంఘం కూడా ఆమె తమ అమ్మాయి అంటూ పేర్కొంటూ శ్రీలీలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మా సూరపనేని వారి అమ్మాయి అయిన శ్రీ లీల హీరోయిన్ గా తెలుగు లో పరిచయం అవ్వబోతున్న సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంటూ ఒక ప్రెస్ నోట్ నే విడుదల చేయడం జరిగింది. ఆ విషయమై సూరపనేని శుభాకరరావు స్పందించాడు. ఆమె నా కూతురు కాదు. నా మొదటి భార్య కూతురు అంటూ ప్రచారం చేసుకుంటూ నా ఆస్తిలో వాటా కోసం ఆమె మరియు ఆమె సన్నిహితులు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ క్లారిటీ ఇచ్చాడు. బెంగళూరు నుండి ఆయన ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఇండస్ట్రీలో ఆమె ముందు ముందు ఒక వెలుగు వెలగ బోతుంది. ఇలాంటి సమయంలో ఆమె ఇలాంటి వివాదంలో ఇరుక్కోవాలని అనుకోదు అని.. ఆమె కావాలని ఈ వివాదాన్ని మొదలు పెట్టి ఉండదు అంటున్నారు.
మరోసారి తన పేరును తండ్రి గా ఉపయోగిస్తే మాత్రం కోర్టుకు వెళ్తానంటూ శుభాకరరావు పేర్కొన్నాడు. ప్రెస్ నోట్ విడుదల చేసిన సూరపనేని వారికి కూడా క్లారిటీ ఇచ్చినట్లుగా తెలియజేశాడు. గత కొంత కాలంగా బెంగళూరులో ఉంటున్న శుభాకరరావు అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో విడిపోయి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య కూతురు శ్రీలీల అంటూ ప్రచారం జరుగుతోంది. కాని ఆయన మాత్రం ఆ వార్తలు నిజం కాదని.. ఆమె తన ఆస్తి కోసం ప్రయత్నిస్తుంది అంటూ కొట్టి పారేశాడు. శ్రీలీలా హీరోయిన్ గా పేరు దక్కించుకోకుండానే ఇలాంటి వివాదాలను ఎదుర్కోవడం ఏమాత్రం సరైనది కాదంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వివాదాలకు ఆమె దూరంగా ఉంటేనే కెరీర్ లో ముందుకు వెళ్లగలదు.