అల్లు అర్జున్ భార్య ఇద్దరు పిల్లలు అంతా కూడా సోషల్ మీడియాలో టాప్ సెలబ్రెటీలు అనే విషయం తెల్సిందే. ఇన్ స్టాలో అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డికి పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ఉంటారు. ఇక అల్లు అర్హ సందడిని అందరు ఇష్టపడుతారు. అయాన్ కూడా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంటారు. ఇక అల్లు అర్జున్ గురించి చెప్పనక్కర్లేదు. మొత్తానికి ఫ్యామిలీ మొత్తం కూడా సోషల్ మీడియాను షేక్ చేసే సెలబ్రెటీలు అనడంలో సందేహం లేదు. సోషల్ మీడియాలో స్నేహా లేదా బన్నీ ఎవరో ఒకరు రెగ్యులర్ గా పిల్లల ఫొటోలు షేర్ చేస్తూనే ఉంటారు. తాజాగా ఈ ఫొటోను షేర్ చేశారు.
ఈ ఫొటోలో అయాన్ క్యూట్ గా నిద్ర పోతూ ఉండగా అల్లు అర్జున్ ఈ సెల్ఫీని తీశాడు. ఇందులు స్నేహా రెడ్డి మరియు అర్హ ను కూడా చూడవచ్చు. అర్హ తన తల్లిపై ముద్దుగా ఉంది. ముద్దుగా ఉన్న ఈ ఫ్యామిలీ సెల్ఫీ ని ఎంత సేపు చూసినా చూడాలనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నెట్టింట ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ మరియు స్నేహా రెడ్డిల జోడీ మరియు ఈ ఫ్యామిలీ మొత్తం ఉన్న ఫొటోలు ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
ఇక అల్లు అర్హ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్న విషయం తెల్సిందే. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమాలో అర్హ నటించింది. వచ్చే ఏడాదిలో ఆ సినిమా విడుదల కాబోతుంది. ఇక పుష్ప మోస్ట్ వెయిటెడ్ మూవీ పుష్ప విడుదలకు సిద్దం అయ్యింది. మరో రెండు వారాల్లో రాబోతున్న పుష్ప సినిమా నుండి ట్రైలర్ ను మరో రెండు రోజుల్లో విడుదల చేయబోతున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కు సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఫాహద్ ఫాజిల్.. సునీల్ మరియు అనసూయలు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. బన్నీ లుక్ ఈ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది.