హలో ప్రెసిడెంట్‌ జీ… బైడెన్‌కు మోడీ ఫోన్‌

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్‌ కు ప్రధాని నరేంద్ర మోడీ మొదటి సారి ఫోన్‌ ద్వారా మాట్లాడి శుభాకాంక్ష లు తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పలువురు దేశాల అధినేతలు ప్రధానులు ఫోన్ లు చేసి అభినందించడం కామన్‌ గా వస్తున్న విషయం. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా జో బైడెన్‌ కు కాల్‌ చేసి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు పలు విషయాలను ఈ సందర్బంగా మాట్లాడినట్లుగా సమాచారం అందుతోంది.

జో బైడెన్‌ తో ప్రధాని నరేంద్ర మోడీ పలు అంతర్జాతీయ విషయాలను చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఉన్న పరిస్థితుల గురించి కూడా చర్చించారట. అంతర్జాతీయ స్థాయిలో వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రపంచ దేశాలు అన్ని కూడా కలిసి కట్టుగా ముందుకు వెళ్లాల్సిన సమయం ఇది అంటూ ఈ సందర్బంగా ఇరువురు దేశాల అధినేతలు మాట్లాడుకున్నారు. ఇక సరిహద్దు వెంట నెలకొన్న పరిస్థితుల గురించి కూడా ప్రధాని నరేంద్ర మోడీని అమెరికా అధ్యక్షుడు అడిగి తెలుసుకున్నారట.