పోష్ ఫ్లాట్ కోసం భారీగా ఖర్చుపెడుతోన్న పూజ హెగ్డే

ప్రస్తుతం పూజ హెగ్డే కెరీర్ పరంగా టాప్ రేంజ్ లో కొనసాగుతోంది. అటు తెలుగుతో పాటు హిందీలో కూడా అమ్మడికి భారీగా అవకాశాలు వస్తున్నాయి. తెలుగుతో పాటు హిందీలో కూడా పూజ హెగ్డే భారీగా పారితోషికాన్ని అందుకుంటోంది.

పూజ ప్రస్తుతం ముంబైలోని పోష్ ప్రాంతంలో సముద్రం వ్యూ కలిగిన అపార్ట్మెంట్ లో 3 బెడ్ రూమ్ ఖరీదైన ఫ్లాట్ ను తీసుకుందట. ఇందుకోసం భారీ అమౌంట్ నే ఖర్చుపెట్టినట్లు సమాచారం. అలాగే ఇంటీరియర్స్ కోసం భారీగా ఖర్చు పెడుతోందిట ఈ భామ. పైగా ఈ పనులను ఆమే స్వయంగా పర్యవేక్షిస్తోందిట.

రీసెంట్ గా ఆమె రాధే శ్యామ్ షూటింగ్ ను పూర్తి చేసింది. ప్రభాస్ ఈ సినిమాలో హీరోగా నటిస్తోన్న విషయం తెల్సిందే. ఒక్క సాంగ్ తప్ప చిత్రీకరణ మొత్తం పూర్తయింది. అలాగే ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ సరసన చిన్న పాత్రలో నటిస్తోంది ఈ భామ. ఇక హిందీలో రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతోన్న సర్కస్, సల్మాన్ ఖాన్ కభీ ఈద్ కభీ దివాళీ సినిమాల్లో నటిస్తోంది.