బీస్ట్ కోసం చెన్నైలో ల్యాండ్ అయిన పూజ

సౌత్ ఇండియా టాప్ నటిగా పూజ హెగ్డే మారుతోంది. వరస ప్రాజెక్ట్స్ తో బిజీబిజీగా ఉంది. రీసెంట్ గా రాధే శ్యామ్ కు సంబంధించి చిన్న షెడ్యూల్ ను పూర్తి చేసిన పూజ హెగ్డే ఈరోజు చెన్నైలో ల్యాండ్ అయింది. థళపతి విజయ్ సరసన పూజ నటించనున్న సంగతి తెల్సిందే.

నెల్సన్ దర్శకత్వంలో విజయ్ చేయబోతున్న చిత్రానికి బీస్ట్ అన్న టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటె బీస్ట్ లేటెస్ట్ షెడ్యూల్ ను ఒక వారంలో మొదలుపెట్టనున్నారు.

విజయ్, పూజ హెగ్డే కాంబినేషన్ లో సీన్స్ ను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. ఇందుకోసం దాదాపు 20 రోజుల షెడ్యూల్ ను ప్లాన్ చేసారు. బీస్ట్ తొలి షెడ్యూల్ పూర్తయ్యాక మళ్ళీ రాధే శ్యామ్ పై ఫోకస్ పెట్టనుంది పూజ హెగ్డే.