పూనమ్ పూల్ సైడ్ ట్రీట్.. కళ్లు తిప్పుకోగలరా?

అందాల కథానాయిక పూనమ్ బజ్వా ఇటీవల టాలీవుడ్ కి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్- కథానాయకుడు` చిత్రంతో టాలీవుడ్ లోకి మళ్లీ కంబ్యాక్ అయినా ఆశించినంత స్పీడ్ అయితే లేదు. పూనమ్ కి ఏదీ కలిసి రాలేదనే చెప్పాలి. భారీ అంచనాల నడుమ విడుదలైన కథానాయకుడు వాటిని అందుకోవడంలో విఫలమైంది. దీంతో పూనమ్ కెరీర్ మళ్లీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే! అన్న చందంగా మిగిలిపోయింది. నిజానికి పూనమ్ కెరీర్ తొలి నుంచి నత్తనడకే సాగుతోంది. తొలుత తెలుగులో మొదటి సినిమాతో నటిగా పరిచమైంది. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అటుపై మరికొన్ని చిత్రాల్లో నటించింది. కానీ కెరీర్ ఏదశలోనే బిజీ అవ్వలేదు. ప్రస్తుతానికి టాలీవుడ్ లో ఆఫర్లు ఏమీ లేవు. మలయాళంలో ఓ చిత్రంలో నటిస్తోంది.

ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అయితే పూనమ్ సమకాలీకులు కొందరు బుల్లి తెరపై బిజీ అవుతున్నారు. కానీ ఈ భామ మాత్రం అటువైపు చూసింది లేదు. ఓటీటీలో బెస్ట్ వెబ్ సిరీస్ ల్లో నటిస్తూ మార్కెట్ ని బిల్డ్ చేసుకునేందుకు ఇప్పుడు ప్రయత్నిస్తుందని అనుకుంటే.. ఆ రకంగాను పూనమ్ ప్రయత్నాలు కనిపించలేదు. మరి పూనమ్ ఆలోచన ఎలా ఉంది? అంటే.. ఈ హాట్ బ్యూటీ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ యమా స్పీడ్ గానే ఉంటోంది. నిరంతరం టెంప్టింగ్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. వీలైనప్పుడల్లా అందాలు విచ్చలవిడిగా ఆరబోస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి పూల్ సైడ్ బికినీ లో కుర్రకారుని పరేషాన్ చేసింది.

స్విమ్మింగ్ పూల్ లో టూపీస్ లుక్ తో మంటలు రేపింది. అలా పూల్ లో స్టన్నింగ్ లుక్ తో కవ్విస్తూనే.. పింక్ ఫ్లవర్ ని అలా తలలో పెట్టుకుని ఛాతి లోతు నీట నిలబడి కెమెరా వైపు ఓ లుక్ ఇచ్చింది.

పూనమ్ బేసిక్ గానే బబ్లీగాళ్ కావడంతో బికినీలో అందాలు మరింతగా హైలైట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. అనుచరగణం కామెంట్లు పీక్స్ కి చేరుకున్నాయి. నెటి జనులు తమదైన శైలిలో పోస్టులు పెడుతూ ఈ ఫోటోగ్రాఫ్ ని వైరల్ చేస్తున్నారు.