ఫోటో స్టోరీ: ఇద్దరు పిల్లలతో.. ఆనందంలో పూనమ్..!

టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ‘మాయాజాలం’ మూవీతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ.. సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువగా పాపులర్ అయింది.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే పూనమ్.. సినీ రాజకీయ సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు వైరాగ్యంతో కూడిన ట్వీట్లు పెడుతూ.. పరోక్షంగా ఎవరి గురించో చెప్పాలని ట్రై చేస్తుంటుంది.

కొన్ని వివాదాస్పద ట్వీట్లు చేయడం.. ట్రోల్స్ వచ్చిన వెంటనే వాటిని డిలీట్ చేయడం మాములే. అలానే #PKlove అనే హ్యాష్ ట్యాగ్ తో ఫోటోలు పోస్ట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో వివాదాలు కూడా కొనితెచ్చుకుంటూ వస్తోంది.

గత కొన్ని రోజులుగా చేనేత పై జీరో జీఎస్టీ పరిష్కారం కృషి చేస్తోన్న పూనమ్ కౌర్.. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది.

హ్యాపీ నెస్ అంటూ ఇద్దరు పిల్లలతో కలిసి ఉన్న ఫోటోని పంచుకుంది పూనమ్. అయితే ఆ కిడ్స్ ఎవరనేది అమ్మడు మెన్షన్ చేయలేదు. దీంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

పూనమ్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారా? అని.. అసలు ఆమెకు పెళ్లి ఎప్పుడైంది? ఇంతకీ క్యూట్ గా ఉన్న ఆ పిల్లలెవరు? అంటూ పలు విధాలుగా వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. కౌర్ బ్రదర్ లేదా ఆమె ఫ్రెండ్ పిల్లలు అయ్యుండొచ్చని అంటున్నారు.

మరికొందరు మాత్రం ఈ ఫొటోలో పూనమ్ పాదాల పై ఫోకస్ పెట్టారు. అందులో ఆమె పాదాలు నల్లగా కనిపించడం చూసి.. సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పిక్స్ పోస్ట్ చేసేటప్పుడు ఇలాంటివి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని కామెంట్స్ చేస్తున్నారు.

35 ఏళ్ల పూనమ్ కౌర్ కు ఇంకా పెళ్లి కాలేదనే సంగతి తెలిసిందే. అయితే తనకు అందరు అమ్మాయిల్లాగే పెళ్లి చేసుకుని మంచి జీవితాన్ని గడపాలని ఉండేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది పంజాబీ బ్యూటీ పూనమ్.

కానీ పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించిన ప్రతిసారీ కొందరు నన్ను కించపరిచేవారని.. తన చుట్టూ ఎందరో రావణులు ఉన్నారని.. తనలో దేవతాగుణం ఉంది కాబట్టి వారిని ఏమీ అనడం లేదని పూనమ్ పేర్కొంది. పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్లిపోదామనుకున్నానని.. కానీ తన జీవితాన్ని మార్చేసింది సినిమానే అని తెలిపింది.

ఇక సినిమాల విషయానికొస్తే.. ‘మాయాజాలం’ తర్వాత పలు తెలుగు తమిళ చిత్రాల్లో నటించింది కానీ.. ఇవేవీ పూనమ్ కౌర్ కు పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. దీంతో సెకండ్ హీరోయిన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయింది. సరైన ఆఫర్స్ లేక గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న పూనమ్.. ఇటీవల ‘నాతి చరామి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది.