తండ్రి జయంతి సందర్బంగా ప్రభాస్‌ కొత్త కారు

యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్ ఇండియాలోనే మోస్ట్‌ క్రేజీ స్టార్‌ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన ఏం చేసినా కూడా అది దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించే విధంగా ఉంటుంది. ఇక ప్రభాస్ తాజాగా తన తండ్రి జయంతి సందర్బంగా లంబోర్గిని కారును కొనుగోలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన లంబోర్గిని కార్లను స్టార్స్ స్టేటస్ సింబల్స్ గా చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ప్రభాస్ ఈ కారును కొనుగోలు చేశాడు.

ఇప్పటికే ప్రభాస్ వద్ద రేంజ్‌ రోవర్‌.. బీఎండబ్ల్యూ ఇంకా పలు ప్రపంచ శ్రేణి అగ్రగణ్యమైన కార్లు ఉన్నాయి. ఆయన తాజాగా మరోసారి లంబోర్గిన కార్లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ప్రభాస్ కొనుగోలు చేసిన కారుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ముంబయిలో ఉన్న ప్రభాస్‌ ఈ కారును విదేశాల నుండి తెప్పించినట్లుగా తెలుస్తోంది. పదుల కోట్లలో పారితోషికంను అందుకుంటున్న ప్రభాస్ కు ఇలాంటి కార్లు పెద్ద లెక్క కాదు. అందుకే వరుసగా కార్లు కొనుగోలు చేస్తున్నాడు.