భారీ ఖర్చుతో ఆది పురుష్ ఫారెస్ట్ సెట్

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం ఆది పురుష్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా సాగుతోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కు మారాల్సి ఉంది. ఎందుకంటే ఆది పురుష్, రామాయణ మహాగాధను మరోసారి అందంగా చెప్పే ప్రయత్నం. ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా, కృతి సనన్ సీత పాత్రలో, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించబోతున్నాడు. ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో న్యాచురల్ లొకేషన్స్ లో షూటింగ్ చేయడం అనేది చాలా కష్టమైన పని. ప్రభుత్వం నుండి అనుమతులు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు, అలాగే శ్రేయస్కరం కూడా కాదు. అందుకే ఆది పురుష్ టీమ్ ముంబైలో అత్యంత ఖరీదుతో ఫారెస్ట్ సెట్ ను వేస్తున్నట్లు తెలుస్తోంది.

మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఎక్కువగా సీన్లను షూట్ చేస్తారు. ఈ ఫారెస్ట్ సెట్ లో మోషన్ క్యాప్చర్ టీమ్ కూడా ఉంటుంది. మోటివ్ క్యాప్చర్ కు అనువుగా ఉండే విధంగా సీన్లను డిజైన్ చేస్తారు.