నాన్న పర్మీషన్‌ తీసుకుని ముద్దు సీన్‌ చేసిన ప్రభాస్‌

టాలీవుడ్‌ హీరోల్లో చాలా మొహమాటస్తుడు మరియు మృదు స్వభావి ఎవరు అంటే ఎక్కువ శాతం ఠక్కున చెప్పే పేర్లలో ప్రభాస్ పేరు ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆల్ ఇండియా సూపర్‌ స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్ ఇప్పటికి కూడా మొహమాటంగానే మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. చిన్న పిల్లాడి మాదిరిగా సిగ్గు పడుతూ హీరోయిన్స్ తో కూడా కాస్త అంటి ముట్టనట్లుగానే ఉంటాడు. అలాంటి ప్రభాస్‌ అడవి రాముడు సినిమా చేస్తున్న సమయంలో ముద్దు సీన్‌ చేయాల్సి వచ్చిందట. ఆ సమయంలో తండ్రికి ఫోన్ చేసి పర్మీషన్ అడిగాడట.

ప్రభాస్‌ కు ఆప్తుడిగా మిత్రుడిగా పేరున్న ప్రభాస్ శ్రీను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెళ్లడించాడు. కమెడియన్‌ ప్రభాస్ శ్రీనుకు ప్రభాస్‌ ఇండస్ట్రీకి రాక ముందు నుండి పరిచయం. ఆ పరిచయంతో ఇద్దరి కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ తో ఉన్న స్నేహం గురించి శ్రీను చెప్పాడు. ఆ సమయంలోనే ప్రభాస్ అడవి రాముడు సినిమాలో ముద్దు సీన్ చేయడం కోసం తన తండ్రికి అప్పటికి అప్పుడు ఫోన్‌ చేసి పర్మీషన్ తీసుకుని మరీ చేశాడు అంటూ ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చాడు. తల్లిదండ్రుల పట్ల ప్రభాస్ కు అంత గౌరవ మర్యాదలు ఉన్నాయని శ్రీను అన్నాడు.