ప్రభాస్‌ సినిమాల్లో ఇది చాలా ప్రత్యేకం

ప్రభాస్‌ తో నాగ్‌ అశ్విన్‌ చేయబోతున్న సినిమా నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉంటుందని అంటున్నారు. తాజాగా నాగ్ అశ్విన్‌ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఆ సందర్బంగా ఆయన మీడియాతో చిట్‌ చాట్‌ చేశాడు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ ప్రభాస్ సినిమా గురించిన ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు. ప్రభాస్‌ తో తాను చేయబోతున్న సినిమా గురించి ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉన్నారో అంతకు మించి అన్నట్లుగా నేను ఉన్నాను అంటూ నాగ్‌ అశ్విన్‌ చెప్పుకొచ్చాడు.

నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ… ప్రభాస్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు వేరు కథ వేరు సోషియో ఫాంటసీతో కూడిన కథ. ఇప్పటి వరకు ప్రభాస్‌ ఇలాంటి తరహ కథను టచ్‌ చేయలేదు. ఈ సినిమా కోసం అంతర్జాతీయ స్థాయి సెట్స్ ను సిద్దం చేస్తున్నాం. హాలీవుడ్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఒక అద్బుత ప్రపంచంలో అడుగు పెట్టిన అనుభూతి కలుగుతుందని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కోసం కాస్త ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తున్నందుకు బాధగా ఉన్నా సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమా ఖచ్చితంగా మంచి ఫీలింగ్‌ కలుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.