ప్రభాస్ మిషన్ ఇంపాజిబుల్ పై ఫుల్ క్లారిటీ!

రెబెల్ స్టార్ ప్రభాస్ రేంజ్ సినిమా సినిమాకూ ఎలా ఎదుగుతూ వెళ్లిందో మనందరం చూసాం. బాహుబలితో తారా స్థాయికి చేరుకున్న ప్రభాస్ ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిని కూడా అందుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఏ సినిమా చేసినా కూడా అది నేషనల్ రేంజ్ లోనే ఉంటుంది. అన్ని సినిమాలూ అలాగే తెరకెక్కుతున్నాయి.

ఇక ఇప్పుడు ప్రభాస్ హాలీవుడ్ లెవెల్ కు కూడా వెళుతున్నాడట. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్, టామ్ క్రూజ్ హీరోగా నటిస్తోన్న మిషన్ ఇంపాజిబుల్ 7లో నటిస్తున్నాడట. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్ర దర్శకుడు క్రిస్టోఫర్ మెక్ క్వారీ ఇండియన్ నటుడు ప్రభాస్ ఈ సినిమాలో నటించడానికి ముందుకు వచ్చినట్లు చెప్పాడట.

రాధే శ్యామ్ షూటింగ్ కోసం ప్రభాస్ ఇటలీ వెళ్ళినప్పుడు దర్శకుడ్ని కలిశాడట. స్టోరీ, తన పాత్ర వరకూ దర్శకుడు నరేట్ చేసినట్లు, ప్రభాస్ ఒక చిన్నపాటి యాక్షన్ బ్లాక్ లో కూడా నటించినట్లు సమాచారం. వచ్చే ఏడాది మే లో మిషన్ ఇంపాజిబుల్ 7 విడుదల కానుంది.