ప్రభాస్ రూ.150 కోట్లు వదిలేశాడు

ప్ర‌భాస్ ఇప్పుడు నేష‌న‌ల్ స్టార్‌గా మారిపోయాడు. ఆయ‌న చేసే ప్ర‌తి సినిమా వంద‌ల‌ కోట్ల‌లోనే ఉంటోంది. ఇక ఆయ‌న రెమ్యున‌రేష‌న్ కూడా అదే స్థాయిలో తీసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఆయ‌న దాదాపు రూ.150 కోట్లు వచ్చే ఛాన్స్ చేజార్చ‌కున్నాడ‌ని తెలుస్తోంది. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ ఇమేజ్ దేశ‌ వ్యాప్తంగా పెరిగిపోయింది. దాంతో ఆయ‌న‌కు యాడ్స్ చేయాలంటూ ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి.

ఆయ‌న ఒకే ఒక్క మహేంద్ర SUV కార్ల బ్రాండ్ల‌కు మాత్ర‌మే అంబాసిడర్ గా కొనసాగుతున్నారు. దీంతో ఆయ‌న‌కు ఇత‌ర బ్రాండ్లు కూడా ఆఫర్లు ఇచ్చినా వాటిల్లో ఆయ‌న న‌టించ‌డానికి ఇంట్రెస్ట్ చూపించ‌ట్లేదంట‌. అలా వ‌రుస ఆఫ‌ర్ల‌ను వ‌దులుకుంటున్నాడు మ‌న రెబ‌ల్ స్టార్‌. దీంతో ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు వ‌దులుకున్న యాడ్స్ విలువ దాదాపు రూ.150 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అంటే దాదాపు మూడు సినిమాల‌కు స‌రిప‌డా రెమ్యున‌రేష‌న్ అన్న‌మాట‌. ఇక ప్ర‌స్తుతం ప్ర‌భాస్ సలార్, ఆదిపురుష్, రాధేశ్యామ్ సినిమాల్లో న‌టిస్తున్నాడు.