రెబెల్ స్టార్ ప్రభాస్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. దాదాపుగా 2000 కోట్లకు పైన బిజినెస్ చేయగల చిత్రాలు ప్రభాస్ ఖాతాలో ఉన్నాయి. రాధే శ్యామ్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే ఆది పురుష్ షూటింగ్ ను కూడా పూర్తి చేసాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కె చిత్రాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు.
ప్రాజెక్ట్ కె ను సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ భారీ వ్యయంతో నిర్మిస్తోన్న విషయం తెల్సిందే. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో దత్ మాట్లాడుతూ ప్రాజెక్ట్ కె విషయంలో షెడ్యూల్స్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసినట్లు, రిలీజ్ డేట్ విషయంలో కూడా ఒక ఐడియాకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది చివరికి షూటింగ్ ను పూర్తి చేసి, మే 2023లో ప్రాజెక్ట్ కెను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనుకుంటున్నారట.