మారుతికి ఓ సలహా ఇచ్చిన ప్రభాస్

ప్రభాస్.. మారుతి కాంబోలో ఒక సినిమా దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. రాధేశ్యామ్ సినిమా హడావుడి పూర్తి అయిన తర్వాత ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రటక రాబోతుంది. ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్న ఆ సినిమాకు దానయ్య నిర్మాతగా వ్యవహరించబోతున్నాడట. కేవలం మూడు నెలల్లోనే ఈ సినిమా ను ముగించేలా మారుతి ప్లాన్ చేశాడు అంటూ ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీంగా అందుతున్న సమాచారం ప్రకారం మారుతి దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా కు రాజా డీలక్స్ టైటిల్ ను పరిశీలించడం జరిగింది. ఆ విషయాన్ని బయటకు లీక్ చేశారు. అయితే ప్రభాస్ ఇమేజ్ కు సరిపోయేలా ఆ టైటిల్ లేదు అంటూ కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేయడం తో పాటు ప్రభాస్ కు కూడా ఆ టైటిల్ విషయం లో సరైన ఆసక్తి లేదట. దాంతో రాజా డీలక్స్ కాకుండా మరో టైటిల్ తో సినిమా వస్తుందని అంటున్నారు.

ఇటీవల స్క్రిప్ట్ చర్చలు జరిపిన సమయంలో ఈ సినిమాకు రాజా డీలక్స్ అని కాకుండా మరేదైనా టైటిల్ ను పరిశీలించాలంటూ మారుతికి ప్రభాస్ సలహా ఇచ్చాడట. స్క్రిప్ట్ విషయంలో అంతా సూపర్ గా సెట్ అయ్యింది. కథ కు ప్రభాస్ చాలా ఎగ్జైట్ అయ్యాడట. టైటిల్ కూడా మొదట ప్రభాస్ కు నచ్చే విధంగానే ఉంది. కాని జనాల్లో వస్తున్న టాక్ నేపథ్యంలో ప్రభాస్ కూడా టైటిల్ ను మార్చాలనే నిర్ణయానికి వచ్చాడట.

ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా విడుదల అవ్వడమే ఆలస్యం వెంటనే మారుతి ఒక ప్రకటన చేసేందుకు సిద్దంగా ఉన్నాడు. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్ గా హాట్ బ్యూఈ మాళవిక మోహనన్ ను ఎంపిక చేయడం జరిగింది. ఆమె హీరోయిన్ గా వరుసగా సినిమాలు తమిళంలో రూపొందుతున్నాయి. కాని తెలుగు లో మాత్రం ఈమెకు ఇదే మొదటి సినిమా..

దానయ్య తో చాలా కాలం క్రితం ప్రభాస్ అగ్రిమెంట్ చేసుకుని అడ్వాన్స్ తీసుకున్నాడట. ఆ సినిమా ను ఇప్పుడు చేసేందుకు డేట్లు ఇచ్చాడు. కేవలం 40 నుండి 45 రోజుల డేట్లతోనే ప్రభాస్ ఈ సినిమాను ముగించేలా మారుతి ప్లాన్ చేశాడనే వార్తలు వస్తున్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజా డీలక్స్ కాకుండా మరైదేనా క్యాచీ టైటిల్ ను పరిశీలిస్తాడేమో చూడాలి.