డార్లింగ్ ని ఇబ్బంది పెడుతున్నార్ బాస్!

డార్లింగ్ ప్రభాస్ మంచి ఫుడీ. అందులోనూ నాన్ వెజ్ వంటకాలు తప్పనిసరి. ప్రభాస్ మెనులో కచ్చితంగా ముడు..నాలుగు నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి. వివిధ రకాల బిరియానీలు ఫిష్ సహా కర్రీలు అన్నింటిని రుచి చూడాల్సిందే. ఇండియన్..చైనీస్..ఇలాలియన్ ఇలా అన్ని రకాల వంటకాలు ప్రభాస్ ఇంట్లోనే సిద్దం అవుతాయి. డైట్ లో లేకపోతే వాటిని కచ్చితంగా ఆరగించాల్సిందే. ఇంకా చెప్పాలంటే ముక్కలేనిదే ముద్ద దిగదు అంతగా నాన్ ప్రియుడు ప్రభాస్.

తన ఇష్టాల్ని సహ చురులపైనా ఎంతో ప్రేమతో చూపిస్తుంటారు. ఆయనతో పనిచేసిన హీరోయిన్లకు..సీనియర్ నటులకు ప్రత్యేకంగా నాన్ వెజ్ కేరియర్లు పంపిస్తుంటారు. నాన్ వెజ్ ప్రియులతో డార్లింగ్ కి మంచి దోస్తులు అయిపోతారు. పొట్ట చెక్కలయ్యేలా తినే వరకూ వదిలిపెట్టరు. అంతగా తన కోస్టార్స్ పై నాన్ వెజ్ ప్రేమని చూపిస్తుంటారు. అయితే డార్లింగ్ హీరో అయిన తర్వాత ఫుడ్ కంట్రోలింగ్ చాలా ఘోరంగానే చేయాల్సి వచ్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తోంది.

`మిర్చి`లో సాప్ట్ గా గ్లామర్ గా కనిపించే ప్రభాస్ లుక్ కోసం చాలా కసరత్తులే చేసారు. ఉప్పు కారం లేని కూరలు తినాల్సి వచ్చిందిట. కేవలం ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ ని మాత్రమే తీసుకునే వారుట. అందుకే `మిర్చి`లో ప్రభాస్ అంత అందంగా కనిపించారు. ఇక తాజాగా నటిస్తోన్న `రాధేశ్యామ్` లోనూ ప్రభాస్ మరింత గ్లామరస్ గా..షైనీగా ఎలివేట్ అవుతున్నారు. మరి దీని వెనుక సీక్రెట్ ఏంటి? అంటే దాని వెనుక చాలా పెద్ద కథే ఉందని ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు.

ఆ లుక్ ని తీసుకు రావడం కోసం డైట్ విషయంలో చాలా కేరింగ్ తీసుకున్నారుట. వెజ్ టెబుల్స్…ప్రూట్ జ్యూస్ మాత్రమే తీసుకునేవారుట. కొన్ని నెలలు పాటు కేవలం ప్రూట్స్ .. వేగిన్…ప్రోటీన్ ఫుడ్ తోనే కడుపు నింపుకోవాల్సి వచ్చిందిట. పాల పదార్ధాలకే పూర్తిగా దూరంగా ఉన్నారు. ఈ ఫుడ్ తనకేమాత్రం ఇష్టం లేదని…నాట్ హ్యాపీ ఫుడ్ అంటూ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. నాన్ వెజ్ వంటకాల్ని ఇష్టపడే వారి పరిస్థితి ఇలాగే ఉంటుంది. అందులోనూ డార్లింగ్ మరీ ఇబ్బంది పడి ఉంటారు. తను నాన్ వెజ్ వంటకాల్ని మిస్ అయినప్పుడల్లా ఇతరులపై ఆ ప్రేమను పార్శిల్ రూపంలో పంపించేవారేమో.

ఇక `బాహుబలి` సినిమా లో అమరేంద్ర బాహుబలి..మహేంద్ర బాహుబలి పాత్రల మధ్య వేరియషన్ కోసం బురువు..పెరగడం తగ్గడం జరిగింది. ఒక పాత్ర నుంచి మరో పాత్ర ట్రాన్సపర్మేషన్ సమయంలో డైట్ విషయంలో ఎంతగా ఇబ్బంది పడ్డారో అప్పటి ఇంటర్వ్యూల్లో రివీల్ చేసిన సంగతి తెలిసిందే. `రాధేశ్యామ్` చిత్రం మార్చి 11న భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఇందులో ప్రభాస్ సరసన పూజాహెగ్డే నటించింది.

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ప్రస్తుతం టీమ్ సినిమా ప్రచారం పనుల్లో బిజీగా ఉంది. రిలీజ్ కి ఇంకా మూడు రోజులే సమయం ఉండటంతో వీలైనంత బజ్ తీసుకొచ్చే పనిలో తలమునకలై ఉన్నారు.