రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. రాధే శ్యామ్ ఐదు రాష్ట్రాల్లో విడుదల కానుండడంతో అన్ని రాష్ట్రాల్లో మీడియా సంస్థలతో ముచ్చటిస్తూ, ప్రెస్ మీట్స్ లో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నాడు.
ఈరోజు మలయాళ వెర్షన్ ప్రమోషన్స్ కోసం కేరళ వెళ్లిన ప్రభాస్ అక్కడి మీడియాతో ముచ్చటిస్తూ తన తర్వాతి చిత్రం సలార్ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు రివీల్ చేసాడు.
అలాగే పృథ్వీరాజ్, రాధే శ్యామ్ కు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు తెలిపి, తనకు ధన్యవాదాలు తెలిపాడు. రాధే శ్యామ్ మార్చ్ 11న విడుదల చేయనున్న విషయం తెల్సిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేసాడు.