‘రాధేశ్యామ్‌’లో ప్రభాస్‌ రెండు పాత్రలు

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ సినిమా కోసం అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ మరి కొన్ని రోజుల్లో ముగించబోతున్నారు. రికార్డు స్థాయి బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ సినిమా 1970 నేపథ్యంలో రూపొందుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 1970 మరియు 2020 కాలాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. రెండు కాలాల మద్య కథ నడుస్తుందట.

ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో కీలక సమాచారం మా వద్ద ఉంది. అదేంటీ అంటే ఈ సినిమాలో ప్రభాస్‌ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఒక పాత్ర 1970లో కనిపించబోతుండగా, రెండవ పాత్ర 2020 కాలంలో సాగుతుందని అంటున్నారు. మొత్తానికి రాధేశ్యామ్‌ తో ప్రభాస్ భారీ ట్రీట్‌ చేయడం ఖాయం అంటూ అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడు అది డబుల్‌ ట్రీట్‌ అవ్వడంతో వారి ఆనందానికి అవధులు ఉండక పోవచ్చు అంటున్నారు. రాధేశ్యామ్ లో ప్రభాస్‌ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. రాధేశ్యామ్‌ పూర్తి అవ్వడమే ఆలస్యం సలార్‌ లో ప్రభాస్‌ నటించబోతున్నాడు.