ఇందిరా గాంధీని కలువబోతున్న ప్రభాస్‌??

ప్రభాస్‌ ప్రస్తుతం రాధేశ్యామ్‌ చివరి దశ షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు. ఈ నెల చివర్లో షూటింగ్‌ కు గుమ్మడి కాయ కొట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే మనం చర్చించుకున్నాం కదా. ఒక పాత్ర 1970 మరియు ఇంకో పాత్రలో 2020 ల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం 1970 కథలో ప్రభాస్‌ కీలక సన్నివేశాల్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని కలుస్తాడట.

ఇందిరా గాంధీ పాత్ర కు సంబంధించిన షూటింగ్‌ జరుపుతున్నారు. ప్రభాస్‌ మరియు ఇందిరా గాంధీల మద్య వచ్చే సన్నివేశాలు చాలా కీలకంగా ఉంటాయని ఆ సన్నివేశాలు సినిమా స్థాయిని అమాంతం పెంచే విధంగా ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రమే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా సినీ అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలు అంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమా ఎక్కువ శాతం ఇటలీ నేపథ్యంలో సాగుతుందట.