తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ట్రెండ్డింగ్ టాపిక్ సమంత నాగ చైతన్యల విడాకుల అంశం. ఈ విషయమై మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్ స్పందించాడు. ఆయన ఈ విషయమై వారి నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లుగా ప్రకటించాడు. విడాకులు అనేది చాలా పెయిన్ పుల్ అంశం. చాలా మంది చాలా రకాలుగా ఈ విషయంలో విడిపోయిన వారిని విమర్శిస్తూ ఉంటే ప్రకాష్ రాజ్ మాత్రం వారి నిర్ణయాన్ని అందరం గౌరవించాలంటూ సూచించాడు. వారి నిర్ణయం బాధించినా కూడా వారి ఇష్టపూర్తిగా తీసుకున్న నిర్ణయం కాబట్టి తప్పు బట్టకూడదు అన్నాడు.
ఇంకా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ నా జీవితంలో కూడా విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఆ సమయంలో ఇతరుల నుండి వచ్చే విమర్శలు మరింతగా ఇబ్బంది కలుగ జేస్తాయి. వారిద్దరు విడి పోవడం చాలా బాధను కలిగించింది. అది వారిద్దరి వ్యక్తిగత విషయం. కలిసి ఉంటే బాగుండు అని అందరికి అనిపిస్తుంది. కాని వారి జీవితంలో ఏం జరిగింది అనేది వారికే తెలుస్తుంది. కనుక వారి నిర్ణయాన్ని గౌరవించాలంటూ పేర్కొన్నాడు. ఇక మంచు విష్ణు తో తీవ్ర పోటీని ప్రకాష్ రాజ్ ఎదుర్కొంటున్నాడు. ఇద్దరిలో ఎవరు గెలిచినా కేవలం అయిదు పది ఓట్ల తేడాతోనే ఉంటుందని అంటున్నారు.