కంగనా రనౌత్ పై విమర్శలు చేసిన ప్రకాష్ రాజ్


విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గత కొంత కాలం నుండి ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొంటున్న విషయం తెల్సిందే. 2019 ఎన్నికలలో ఎంపీ స్థానానికి పోటీ పడినా ప్రకాష్ రాజ్ ఓటమి చెందారు. అయితే సోషల్ మీడియాలో జస్ట్ అస్కింగ్ పేరిట ప్రకాష్ రాజ్ ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుండి కంగనా రనౌత్ వ్యవహారం తీవ్రంగా చర్చనీయాంశమవుతోన్న విషయం తెల్సిందే.

మహారాష్ట్ర సర్కారుపై నిప్పులు చెరుగుతోంది ఆమె. ముంబైను పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చటం దగ్గరనుండి కంగనా విమర్శలు ప్రభుత్వానికి కోపం తెప్పించడంతో బీఎంసీ అధికారులు వచ్చి కంగనా ఆఫీస్ ను నిబంధనలకు వ్యతిరేకంగా ఉందన్న కారణంతో కూలగొట్టిన విషయం తెల్సిందే.

అయితే కంగనా ఈ వ్యవహారంలో ఇంకా విమర్శలు ఎక్కువ చేసింది. ఈ వ్యవహారంపై కంగనాకు కొన్ని వర్గాల నుండి సపోర్ట్ లభిస్తే మరికొందరి నుండి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. రీసెంట్ గా విశాల్ నీకు హ్యాట్సాఫ్ కంగనా అంటూ నోట్ విడుదల చేసారు. ఈ వ్యవహారంలో ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా చేరారు.

ఈరోజు సోషల్ మీడియాలో కంగనా వ్యవహారంలో ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ఒక ఇమేజ్ ను పోస్ట్ చేసాడు. ఒక్క సినిమాకే కంగనా రాణి లక్ష్మీ బాయ్ లా ఫీలైపోతుంటే దీపికా పద్మావతి, హ్రితిక్ రోషన్ అక్బర్, షారుఖ్ ఖాన్ అశోక, భగత్‌ సింగ్‌లో నటించిన అజయ్ దేవగణ్‌, మంగళ్‌ పాండేగా నటించిన ఆమిర్‌ఖాన్‌, మోడీగా నటించిన వివేక్‌ ఒబెరాయ్‌ కూడా వాళ్ళు అయిపోతారా అన్న తరహాలో ఆ పోస్టర్ ఉంది.