సక్సెస్ తలకు ఎక్కిన సమయంలో కొందరికి తెలియకుండానే గర్వం కలుగుతుందని అంటూ ఉంటారు. కేజీఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ లో గర్వం కనిపిస్తుందని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వారు అలా కామెంట్స్ చేయడానికి ఒక కారణం కూడా ఉంది. అదేంటీ అంటే ఇటీవల ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఆ సందర్బంగా అభిమానులతో చిట్ చాట్ చేశాడు. ఆ సమయంలో తదుపరి సినిమాలను ఎన్టీఆర్ మరియు ప్రభాస్ లతో చేయడానికి కారణం ఏంటీ అన్నట్లుగా ప్రశ్నించారు.. వారినే ఎందుకు ఎంచుకున్నారు అంటూ కొందరు ప్రశ్నించారు.
వారి ప్రశ్నకు కాస్త వింతైన సమాధానంను ఆయన ఇచ్చాడు. నేను హీరోలను ఎంపిక చేసుకోలేదు. వారే నా కథలను ఎంపిక చేసుకున్నారు అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఆ వెంటనే అంతటి పెద్ద స్టార్స్ ను ఎంపిక చేసుకునేంత స్థాయికి నేను చేరలేదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. నా కథలు నచ్చడం వల్లే వారు నా సినిమాలు చేస్తున్నారని అన్నాడు. కొందరు అభిమానులు ప్రశాంత్ నీల్ సమాధానంను పొగరు సమాధానం అంటూ ఉంటే కొందరు మాత్రం ఆయన సింప్లిసిటీ అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ప్రశాంత్ నీల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయన ఉద్దేశ్యం ఏంటీ అనే విషయమై చర్చ జరుగుతుంది.