తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి ఇప్పటి వరకు చాలా రకాలుగా వార్తలు వచ్చాయి. కాని ఏ ఒక్కటి నిజం కాలేదు. విష్ణు ప్రియ నుండి మొదలుకుని ఎంతో మంది ప్రముఖ అందగత్తెల పేర్లు వినిపించాయి. కాని వారెవ్వరు కూడా బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వడం లేదు అంటూ తేలిపోయింది. తాజాగా మరోసారి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించిన వార్తలు మొదలు అయ్యాయి. ప్రితీ అనే అమ్మాయి బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ వార్తలు రావడంతో ఎవరు ఆ ప్రీతీ అంటూ అంతా కూడా తెగ వెదికేశారు.
ప్రీతి అన్షు ఒక మోడల్. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో కూడా తీసింది. ఏమాత్రం గుర్తింపు లేని ఆమె ఎలా బిగ్ బాస్ కు వెళ్తుంది అంటూ అంతా కూడా ముక్కున వేలు వేసుకుంటున్నారు. అసలు విషయం ఏంటీ అంటే పబ్లిసిటీ కోసం ఆమె స్వయంగా కావాలని చేసుకున్న ప్రచారం అంటూ వార్తలు వస్తున్నాయి. వైల్డ్ కార్డు ఎంట్రీ అనేది ఈసారి ఉండక పోవచ్చు అంటున్నారు. ప్రీతి అన్షు మాత్రమే కాదు ఎవరు కూడా ఈ సీజన్ లో వైల్డ్ ఎంట్రీ ఇవ్వబోవడం లేదు అంటూ షో నిర్వాహకులు అనఫిషియల్ గా చెబుతున్నారు.