ఒక చెవితో విని రెండో చెవితే వదిలేయాలి!-ప్రియమణి

జాతీయ ఉత్తమనటిగా ప్రియమణికి ఇండియా లెవల్లో ఉన్న ఇమేజ్ వేరు. ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ తో తన ఇమేజ్ మరింతగా పెరిగింది. పర్ఫెక్ట్ నేచురల్ పెర్ఫామర్ గా అభిమానుల గుండెల్లో నిలిచింది. ప్రస్తుతం బుల్లితెర రియాలిటీ షోల జడ్జిగా కొనసాగుతూనే.. మరోవైపు సినిమాలతో బిజీగా ఉంది ప్రియమణి. తాజాగా ప్రియమణి నటించిన భామా కలాపం ఆహా – ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ట్రైలర్ ఇంతకుముందు విడుదలై ఆకట్టుకుంది.

తనని తాను ఏజ్ తో పని లేకుండా.. అత్యంత ఆకర్షణీయమైన నటీమణులలో ఒకరిగా నిలబెట్టుకునేందుకు ప్రియమణి చేయని ప్రయత్నం లేదు. అయితే ఇంతలోనే తన వ్యక్తిగత కుటుంబ జీవితంపై రూమర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఆమె సినీ పరిశ్రమలో వస్తున్న గాసిప్స్ పై ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ గాసిప్స్ గురించి తనని ప్రశ్నించగా.. చాలా ప్రాక్టికల్ గా బదులిచ్చారు. మీరు దీనికి ఎక్కువ స్పందిస్తే.. అది అగ్నికి ఆజ్యం పోసినట్లుగా అనిపిస్తుంది. ఒక చెవితో విని మరో చెవితో వదిలేయాలి! అని తెలిపింది. నేను నా కుటుంబానికి మాత్రమే జవాబుదారీగా ఉన్నాను. భర్త కుటుంబాన్ని మించి ఇంకేదీ లేదు. మొత్తం ప్రపంచానికి బాధ్యురాలిని కాను.. అని ప్రియమణి అన్నారు.

రంగుల ప్రపంచంలోని క్లిష్ఠమైన పరిస్థితులతో మెలగడంల ఇది నిజంగా పరిణతి చెందిన మార్గం. వ్యక్తిగత వ్యవహారాల్లో గాసిప్స్ ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎంతో పరిణతి అవసరమని ప్రియమణి చెప్పకనే చెప్పారు. గ్లామర్ ప్రపంచంలో గాసిప్స్ అనేవి సర్వసాధారణం. ఇక్కడ గాసిప్ ల బురదలోకి లాగకుండా దాదాపు ఏ నటీ లేదు. కొన్ని గాసిప్ లు నిజమని తేలింది. కొన్ని కేవలం వినేందుకు మాత్రం నిజమేననిపిస్తాయి.. కానీ కాదు!!